HomeTelugu Trendingచిరంజీవి నెక్ట్స్‌ మూవీ దర్శకుడు ఇతనే

చిరంజీవి నెక్ట్స్‌ మూవీ దర్శకుడు ఇతనే

Chiranjeevi next movie movi
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరువాత వరుస సినిమాలతో బీజీగా ఉన్నాడు. ప్ర‌స్తుతం ఆయన నటిస్తున్న ‘ఆచార్య‌’ సినిమా షూటింగ్‌ చివరి ద‌శ‌కు చేరుకుంది. ఈ సినిమా మే 13న ప్ర‌పంచ వ్యాప్తంగా రీలీజ్‌ కానుంది. దీని త‌ర్వాత మ‌ల‌యాళ చిత్రం లూసిఫ‌ర్ రీమేక్ చేయనున్నారు‌. మోహ‌న్‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న సినిమా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మ‌రో వైపు డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేశ్ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ చిత్రం వేదాళం రీమేక్‌లోనూ చిరంజీవి న‌టించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన ప‌నులు సైలెంట్‌గా జ‌రిగిపోతున్నాయి. ఈ సినిమాలు కాకుండా మ‌రో సినిమాను చిరంజీవి ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తెలియజేశారు. యంగ్ డైరెక్ట‌ర్‌ బాబి తో చిరంజీవి ఓ సినిమా చేయనున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌లో ఈ సినిమా రూపొంద‌నుంది. ఈ విష‌యాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ కూడా ట్విట్ట‌ర్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే వచ్చే ఏడాదిలో బాబీ, చిరు కాంబో సినిమా పట్టాలెక్కుతుందని చిరు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu