HomeTelugu Newsచిరంజీవి టైటిల్‌తో సూపర్‌ స్టార్‌..

చిరంజీవి టైటిల్‌తో సూపర్‌ స్టార్‌..

14 13
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ గత కొన్ని రోజులుగా ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్నారు. మంచి సినిమాలు చేస్తున్నా బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ దర్శకుడు శివ కాంబినేషన్లో అన్నతే సినిమా వస్తోంది. ఈ సినిమా యాక్షన్ ప్రధానంగా సాగుతున్నట్టు సమాచారం. అజిత్ తో వరసగా నాలుగు సినిమాలు చేసిన శివ, ఇప్పుడు రజినీకాంత్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేస్తారు.

ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే, తెలుగులో ఈ సినిమాకు అన్నయ్య అనే టైటిల్ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్ ఇటీవల కాలంలో సినిమాలు వస్తున్నాయి. తమిళంలో ఖైదీ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ చేశారు. మంచి విజయం సాధించింది. అలానే దొంగ సినిమా కూడా. ఇప్పుడు రజినీకాంత్ కూడా అదే బాటలో నడవబోతున్నారు. రజినీకాంత్ కొత్త సినిమా అన్నతే సినిమాను తెలుగులో అన్నయ్య పేరుతో విడుదల చేస్తారట. అన్నతే అంటే తెలుగులో అన్నయ్య అనే అర్ధం ఉన్నది. అందుకే ఈ టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారని సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu