‘వెంకీ మామ’లో హీరోయిన్స్‌ వీరే!

సీనియర్‌ నటుడు విక్టరీ వెంకటేష్, యంగ్‌ హీరో నాగ చైతన్యలు కలిసి ఒక మల్టీ స్టారర్ చేయనున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న ఈ సినిమా షూట్ ఈ నెలలోనే మొదలుకానుంది. మొదటి షెడ్యూల్ చెనైలో జరగనుంది. కాగా ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించనుండగా, వెంకీ సరసన శ్రీయ శరన్‌ను ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, కోనా వెంకట్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు ‘వెంకీ మామ’ అనే టైటిల్ ను నిర్ణయించిన సంగతి తెలిసిందే.

CLICK HERE!! For the aha Latest Updates