HomeTelugu Big Storiesచిరు హీరో పవన్ నిర్మాత!

చిరు హీరో పవన్ నిర్మాత!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా పవన్ కల్యాణ్ నిర్మాణంలో సినిమా ఉండనుందా..? అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇటీవలే పవన్ కల్యాణ్ ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పేరిట ఓ బ్యానర్ ను స్థాపించి సినిమాలను నిర్మించడం మొదలుపెట్టాడు.

ఇందులో భాగంగా నితిన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. అలానే తన అన్నయ్య చిరంజీవి హీరోగా ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. రీసెంట్ గా త్రివిక్రమ్.. ప్రత్యేకంగా చిరంజీవిని కలిసి మాట్లాడారు. అది కూడా ఈ సినిమా గురించే అని తెలుస్తుంది.

వారిద్దరి మధ్య కథా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్, పవన్ కల్యాణ్ ప్రొడక్షన్ కావడంతో చిరు కూడా ఈ ప్రాజెక్ట్ పై మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాను. ఈ విషయం మెగాభిమానులకు శుభవార్తనే చెప్పాలి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu