రవితేజ, రానా ఓ మల్టీస్టారర్..?

తమిళంలో ఘన విజయం సాధించిన ‘విక్రమ్ వేద’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొదట తెలుగు రీమేక్ కోసం వెంకీ, రానాలను తీసుకోబోతున్నట్లుగా వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు వెంకీ స్థానంలో రవితేజ వచ్చి చేరినట్లుగా తెలుస్తోంది.

విజయ్ సేతుపతి నటించిన మాస్ డాన్ తరహా పాత్రలో రవితేజ నటించబోతున్నాడని సమాచారం. ఆ పాత్ర రవితేజకు సూట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో రానా కనిపించబోతున్నారు. తమిళంలో పుష్కర్-గాయత్రి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను తెలుగులో ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారనే విషయంలో ఓ క్లారిటీ రావాల్సివుంది.

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి. ప్రస్తుతానికి ఈ ఇద్దరు హీరోలు కూడా తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతున్నారు.