HomeTelugu Big Storiesఏఐజీ వైద్యులను ప్రశంసించిన చిరంజీవి

ఏఐజీ వైద్యులను ప్రశంసించిన చిరంజీవి

Chiranjeevi praises to aig

ప్రపంచవ్యాప్తంగా క‌రోనా విజృంభించిన సమయంలో విశేష వైద్య సేవ‌లు అందించిన హైదరాబాదులోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రి వైద్యులను మెగాస్టార్‌ చిరంజీవి అభినందించారు. స్వ‌యంగా ఆ ఆసుప‌త్రికి వెళ్లి వైద్యులు, సిబ్బందితో ముచ్చటించారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ ఆయ‌న ట్వీట్ చేశారు. ఏఐజీ ఆసుప‌త్రికి వెళ్లి వైద్యుల‌ను అభినందించే అవ‌కాశం వ‌చ్చిందని చిరంజీవి చెప్పారు.

చిరంజీవవి స్వ‌యంగా ఆసుపత్రికి వెళ్లి అక్క‌డి వైద్యుల‌ని క‌లిసి వారిని ప్ర‌శంసించారు. త‌న ట్విట్ట‌ర్‌లో వారితో దిగిన ఫొటోల‌ను షేర్ చేస్తూ.. ‘ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి అక్కడి డాక్టర్లను కలిసే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. కరోనా స‌మ‌యంలో వారు చేసిన సేవ‌లు చాలా గొప్ప‌వి. క్లిష్ట స‌మ‌యంలో ఆసుపత్రిని ఎంతో చాకచక్యంగా ముందుకు తీసుకువెళ్లిన పద్మభూషణ్ అవార్డు గ్రహిత హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి నా హృదయపూర్యక ధన్యవాదాలు అంటూ చిరు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu