HomeTelugu Trendingచిరంజీవి కుడి చేతికి సర్జరీ

చిరంజీవి కుడి చేతికి సర్జరీ

Chiranjeevi meeting with fa

మెగాస్టార్‌ చిరంజీవి తన కుడి చేతికి సర్జరీ అయిందని, దీనివల్ల ‘గాడ్‌ఫాదర్‌’ షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చానని ఆయన తెలిపారు. కరోనా, లాక్‌డౌన్‌ కాలంలో ఆక్సిజన్‌ బ్యాంకు ద్వారా తెలంగాణలో సేవలందించిన అభిమానులతో చిరంజీవి ఆదివారం భేటీ అయ్యారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చేతికి ఉన్న బ్యాండేజ్‌ గురించి అభిమానులు ప్రశ్నిస్తే ఆయన పై విధంగా స్పందించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘కుడి అరచేతిలో నొప్పిగా, తిమ్మిరిగా ఉండటంతో వైద్యులను సంప్రదించాను. వాళ్లు చిన్న శస్త్రచికిత్స చేశారు. 15రోజులు విశ్రాంతి తీసుకుంటాను. నవంబర్‌ 1 నుంచి గాడ్‌ఫాదర్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాను’ అని తెలిపారు. కాగా చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu