HomeTelugu Big Storiesఆచార్య గురించి మరో రహస్యం చెప్పిన చిరు

ఆచార్య గురించి మరో రహస్యం చెప్పిన చిరు

Chiru Acharya set
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా గురించి మరోసారి చెప్పేశారు. చిత్రం పేరు ఆచార్యను ఎంతో రహస్యంగా ఉంచాలనుకుంది చిత్ర బృందం. అయితే చిరంజీవి అనుకోకుండా ఆచార్య అని వెల్లడించి నాలుక్కరుచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆచార్య సినిమా గురించి మరో రహస్యం బయటపెట్టేశారు. ఈసారి కావాలనే చేశారు. సినిమాలో కీలకమైన ఓ ఆలయ సెట్‌కు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. మొత్తం సినిమాకు ఇది హైలైట్‌గా నిలవనుంది. ఆర్ట్ డైరెక్టర్ సెల్వరాజన్ ఈ సెట్‌ను తీర్చిదిద్దారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu