HomeTelugu Big Storiesప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారా?.. సిద్ శ్రీరామ్ పరిస్థితి ఏమిటి?

ప్రేక్షకులు మార్పు కోరుకుంటున్నారా?.. సిద్ శ్రీరామ్ పరిస్థితి ఏమిటి?

13 4

ఒక్కోసారి ఒక్కో పాట ట్రెండింగ్‌లో ఉంటుంది. తరచూ మార్పు కోరుకుంటారు ప్రేక్షకులు. అయితే సింగర్ సిద్ స్వరంలో ఏదో మ్యాజిక్ ఉంటుందంటున్నారు సంగీత ప్రియులు. అలా అని అతన్ని విమర్శించేవారూ లేకపోలేదు. ఈ ఏడాది ప్రారంభమై 2 నెలలే అయినప్పటికీ ఈయన నుంచి 9 పాటలు వచ్చాయి. అయితే ఈయన పాటల్లో మార్పు కనిపిస్తోందా..? అన్నీ ఒకేలా ఉన్నాయా..? దీనిపై మ్యూజిక్ లవర్స్‌లో చర్చ జరుగుతోంది. తాజాగా విడుదలైన వకీల్ సాబ్ సినిమాలో మగువా.. మగువా పాట కూడా ఈ యువ గాయకుడే పాడాడు. బడా హీరోలే ఈయనపై మొగ్గు చూపడంతో చిన్న హీరోలు కూడా ఇతడికే ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజాగా యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాలో నీలి నీలి ఆకాశం.. సాంగ్ విడుదలైన 5 వారాల్లోనే 60 మిలియన్ వ్యూస్‌ని సొంతం చేసుకుంది. అయితే పర భాషస్తుడు కావడంతో సిద్ శ్రీరామ్ స్వరంలో తప్పులు దొర్లుతున్నా పట్టించుకోవడం లేదు.

కానీ ఈ క్రేజ్ ఎన్నాళ్లో ఉండదన్న మాట సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆడియన్స్‌లో కూడా అదే భావన వ్యక్తమవుతోంది.ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా గమనిస్తున్నారా? అందుకే సిద్ వాయిస్‌ను సైడ్ తీసుకుంటున్నారా.. ఈ వారంలో విడుదలైన కొన్ని పాటలను గమనిస్తే అదే విషయం అర్ధమవుతోంది. డీఎస్పీ స్వరకల్పనలో జావేద్ అలీ పాడిన ‘నీ కన్ను.. నీలి సముద్రం’ పాట.. 10 మిలియన్ వ్యూస్‌తో జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతోంది. రెడ్‌ మూవీకోసం మణిశర్మ ట్యూన్ నువ్వే నువ్వే పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించగా రిలీజైన ఒక్కరోజులోనే ఒక మిలియన్ మార్క్ దాటిపోయింది. ‘ఉమామహేశ్వర
ఉగ్రరూపస్య’ చిత్రం కోసం జేసుదాస్ వారసుడు విజయ్ ఏసుదాసు ఆలపించిన మెలోడీ మాస్ `నింగి చుట్టే మేఘం` సాంగ్ ప్రేక్షకులను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటుంది. వీటన్నిటిని బట్టి చూస్తుంటే సింగర్ సిధ్ శ్రీరామ్‌ పాట నుంచి శ్రోతలు కాస్త మార్పు కోరుకుంటున్నారనిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu