సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ‘టాలీవుడ్ కోరికను మన్నించి.. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ యాజమాన్యం, అన్ని వర్గాలవారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ ధరలను సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు, వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు జరిపి అన్ని సమస్యలు అర్ధం చేసుకున్న చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పరిశ్రమ బాగు కోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్‌కు ప్రత్యేక ధన్యవాదాలుస అని చిరంజీవి పేర్కొన్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గించింది. మరోవైపు టికెట్ రేట్లు పెంచాలనే నిర్మాతల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటిని పరిశీలించిన తెలంగాణ సర్కారు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పరిశ్రమ ప్రతినిధులతో ఎన్నో చర్చలు
జరిపి అన్ని సమస్యలు అర్ధం చేసుకున్న
చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గారికి @TelanganaCMO ,మంత్రివర్యులు
శ్రీ @YadavTalasani గారికి, పరిశ్రమ బాగుకోసం చొరవ తీసుకున్న ఎంపీ సంతోష్ కుమార్ @MPsantoshtrs గారికి ప్రత్యేక ధన్యవాదాలు.— Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2021