HomeTelugu Big Storiesనీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. చిరంజీవి ట్వీట్ వైర‌ల్

నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం.. చిరంజీవి ట్వీట్ వైర‌ల్

Chiranjeevi Welcomes Actor Satyadev To Join Godfather Movie

కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం ఆచార్య. మెగా స్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. నేడు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. పరాజయం ఎరుగని కొరటాల శివ దర్శకత్వంలో తొలిసారి చిరంజీవి నటిస్తుండడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఆ అంచనాలు మరింత పెంచేలా తన తండ్రితో కలసి రాంచరణ్ పూర్తి స్థాయి పాత్రలో నటించారు … ఇక ఈ సినిమా గురించి సత్యదేవ్ ‘అన్నయ్యా, నటనలో జీవితంలో మాలాంటి ఎందరికో ఆచార్య మీరు. అభిమానిగా గుండెల్లో చిరకాలం తలిచేది మీ పేరునే. మిమ్మల్ని చూసే నటుడిగా మారాను. ఈ రోజు ఆచార్య సినిమాలో కాసేపైనా మీతో పాటు కనిపించే అదృష్టం కలిగింది. మీ కష్టం, క్రమశిక్షణ దగ్గర నుంచి చూసి నేర్చుకునే అవకాశం దక్కింది” అంటూ మెసేజ్ పోస్ట్ చేశారు సత్యదేవ్.ఇది చూసిన చిరంజీవి.. ”డియర్ సత్యదేవ్.. థాంక్యూ. నీలాంటి చక్కని నటుడు నా అభిమాని కావడం చాలా సంతోషం. ఆచార్యలో తక్కువ నిడివి పాత్రలో అయినా నువ్వు కనిపించడం నాకు ఆనందం కలిగించింది. గాడ్ ఫాదర్ సినిమాలో నా అభిమాని నాకు ఎదురు నిలబడే పూర్తి స్థాయి పాత్రలో నటించడం నాకు గర్వంగా ఫీల్ అవుతున్నా” అని పేర్కొంటూ రిప్లై పెట్టారు. దీంతో ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

చిరంజీవి కెరీర్‌లో 153వ సినిమా ‘గాడ్ ఫాదర్’ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. నయనతార కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. వీరితో పాటు యంగ్ హీరో సత్యదేవ్ రోల్ కీలకంగా మారనుందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu