విక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్!

ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా మొదలుకానుంది. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ డైరెక్షన్ లో మరో సినిమా చేయడానికి రెడీ అయిపోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడట. విక్రమ్
తెరకెక్కించే కథలు.. అవి సాధించిన విజయాలు చూసిన ఎన్టీఆర్ తనతో కలిసి సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నాడట. ఓ కథ విషయంలో విక్రమ్ తో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం.

విక్రమ్ ప్రస్తుతం అఖిల్ తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత పూర్తి కథను సిద్ధం చేసి ఎన్టీఆర్ తో సెట్స్ పైకి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సినిమాతో పాటు విక్రమ్ సినిమా కూడా ఒకేసారి ప్రారంభిస్తే బావుంటుందని ఆలోచిస్తున్నట్లు టాక్. మరి రెండు సినిమాలు ఒకేసారి పట్టాలెక్కిస్తాడేమో చూడాలి!