HomeTelugu Trendingఇళ్లు లేని సినీ కార్మికులకు పవన్ అండ

ఇళ్లు లేని సినీ కార్మికులకు పవన్ అండ

13
హైదరాబాద్‌లోని చిత్రపురిలో ఇళ్లు దక్కని సినీరంగంలోని వారికి భరోసాగా ఉంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. చిత్రపురి సాధన సమితి సభ్యులు హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్లు ఇలా చిత్ర రంగంలోని 24 విభాగాల్లో పనిచేసే వారు తమకు ఇళ్లు దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారని, సినీరంగానికి సంబంధం లేని వారు ఇళ్లు దక్కించుకుంటున్నారని పవన్‌కు తెలిపారు.

చిత్రపురిలో ఇళ్లు దక్కక బాధపడుతున్న వారికి అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు. ఈ అంశంపై తమ్మారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎన్.శంకర్‌తో చర్చిస్తానని అన్నారు. చిత్రపురిలో తెలుగు సినిమా రంగానికి చెందిన వారి సొంతింటి కల నెరవేరాలని అన్నారు. చిత్రపురి కాలనీలో సమస్యలను సామరస్యంగా పరిష్కరించేలా కృషి చేస్తామని పవన్ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu