తమన్నా చేయిపట్టుకున్న చోటాకే నాయుడు.. ఫొటో వైరల్‌

చోటాకే నాయుడు ఇండస్ట్రీలో సీనియర్ కెమెరామెన్. ఆయన కెమెరానుంచి వచ్చిన చాలా సినిమా సూపర్ హిట్ కొట్టాయి. సినిమాను అందంగా కెమెరాలో చూపించడంలో ఈయన దిట్ట. అంతరవరకు సరే.. ఇటీవలే ఓ వేడుకలో చోటాకె నాయుడు నటి కాజల్ నచ్చిందని చెప్పి ఆమెను ముద్దుపెట్టుకున్నాడు.

ఆ హఠాత్ సంఘటనతో కాజల్ నివ్వెరబోయింది. పాపం కాజల్ ఏమనలేక గమ్మునుండిపోయింది. ఇది జరిగి చాలా రోజులైంది. అయితే తాజాగా తమన్నా హీరోయిన్ గా రాజుగారి గది 3 సినిమా ప్రారంభం అయ్యింది. ఆ రోజున జరిగిన కార్యక్రమంలో తమన్నా.. పక్కనే ఛోటా కె నాయుడు నిలబడ్డాడు. ఆప్యాయంగా తమన్నా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ప్రేమగా పట్టుకున్నాడు. తమన్నా ఏమి మాట్లాడలేదు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.