HomeTelugu Big Stories'గుంటూరు కారం' నుండి క్రిస్మస్‌ స్పెషల్ పోస్టర్‌

‘గుంటూరు కారం’ నుండి క్రిస్మస్‌ స్పెషల్ పోస్టర్‌

Christmas special poster frసూపర్ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ రోజు క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఈ సినిమా నుండి మ‌హేష్‌బాబు కొత్త పోస్ట‌ర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

అత‌డు, ఖ‌లేజా త‌ర్వాత మ‌హేష్ బాబు, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా గుంటూరు కారం తెర‌కెక్కుతోంది. మ‌ద‌ర్ సెంటిమెంట్‌, వినోదం, యాక్ష‌న్ అంశాల క‌ల‌బోత‌గా త్రివిక్ర‌మ్ రూపొందిస్తోన్న ఈ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న రిలీజ్ కానుంది.

శ్రీలీల‌, మీనాక్షి చౌద‌రి ఈ సినిమా లో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే గుంటూరు కారం ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌బోతున్నారు. త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై చిన‌బాబు గుంటూరు కారం మూవీని నిర్మిస్తున్నాడు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu