బన్నీ బ్రాహ్మణ లుక్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటిస్తోన్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. ఈ సినిమాకు సంబంధించిన లుక్ ను ఫిబ్రవరి 18న విడుదల చేయబోతున్నారు. ఈలోగా ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణ లుక్ ఎలా ఉంటుందో.. బయటకు వచ్చేసింది. ఈ లుక్ చూసిన బన్నీ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే గతంలో చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లు తప్ప ఏ హీరో కూడా పూర్తిస్థాయి బ్రాహ్మణ యువకుడిగా సినిమాల్లో నటించలేదు.

దీంతో దువ్వాడ జగన్నాథం సినిమాలో బన్నీ ఎలా ఉంటుందనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. దానికి తగ్గట్లుగానే బన్నీ లుక్ లీక్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి లుక్ బయటకు రాకుండా ఉండానికి చిత్రబృందం ఎంతగా ప్రయత్నించినా.. కొందరి అత్యుత్సాహం వలన ఇప్పుడు లుక్ బయటకు వచ్చేసింది. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రానికి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది వేసవి కానుకగా సినిమాను రిలీజ్ చేయాలనేది ప్లాన్.