HomeTelugu Trendingసంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్

సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్

3 12
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించిందని, రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్‌ తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. గంటపాటు గుడివాడలోని లింగవరం రోడ్ కే కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్ పాల్గొంటారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu