HomeTelugu Trendingబాలు త్వరగా వచ్చేయ్.. ఇళయరాజా ఎమోషనల్ వీడియో

బాలు త్వరగా వచ్చేయ్.. ఇళయరాజా ఎమోషనల్ వీడియో

Ilayaraja emotional video aకరోనాతో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రముఖ గాయకుడు ఇళయరాజా ఒక ఎమోషనల్ వీడియో ను విడుదల చేశారు. ఈ మేరకు ఎస్పీ బాలుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ”బాలూ..తొందరగా కోలుకుని రా.. నీకోసం ఎదురు చూస్తుంటాను. మనిద్దరి జీవితం కేవలం సినిమాలతోనే ముగిసిపోదు.. సినిమాలతోనే మొదలైందీ కాదు. వాటికన్నా ముందు మనం సంగీత వేదికలపై చేసిన కచేరీ కార్యక్రమాలు… ఆ సంగీతం మనకు జీవితమూ, జీవితాధారమూ అయ్యాయి. ఆ వేదికలపైన మొదలైన మన స్నేహం… సంగీతమూ, స్వరమూ లాంటిది. స్వరం లేని సంగీతం ఎలా ఉండలేదో అలా నీ స్నేహం, నా స్నేహం, మన స్నేహం ఎన్నడూ దూరం కాదు. ఇద్దరి మధ్య గొడవ వచ్చినా… రాకున్నా స్నేహం స్నేహమేననీ నాకూ తెలుసూ, నీకూ తెలుసూ. కాబట్టి నువ్వు కోలుకుని లేచి రా. నువ్వు తిరిగి వస్తావని నా అంతరాత్మ చెబుతోంది. ఇది నిజం కావాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. బాలు, త్వరగా వచ్చేయ్. నీ కోసం నేను వేచి చూస్తున్నాను’’ ” అని ఇళయరాజా ఎమోషనల్ అయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu