HomeTelugu Trendingహీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నహాస్యనటుడు

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నహాస్యనటుడు

Madhunandan Gunde Katha Viటాలీవుడ్‌లో హాస్యనటుడు మధునందన్ ‘ఇష్క్’ ‘గుండే జారి గల్లంతయ్యిందే’ ‘గీతాంజలి’ ‘ఒక లైలా కోసం’ ‘టాక్సీవాలా’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా మధునందన్‌ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా ‘గుండె కథ వింటారా’ టైటిల్‌తో తెరక్కెకుతుంది. వంశీధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ట్రినిటీ పిక్చర్స్ బ్యానర్ పై క్రాంతి మంగళంపల్లి మరియు అభిషేక్ చిప్ప కలిసి నిర్మిస్తున్నారు. ఇందులో మధునందన్ సరసన స్వాతిష్ట కృష్ణన్ మరియు శ్రేయా నావిలే హీరోయిన్‌లుగా నటించారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఫుల్ గడ్డంతో ఉన్న మధునందన్ సిగరెట్ తాగుతూ.. బైక్ పై కూర్చొని ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. టైటిల్ తో పాటు ఈ పోస్టర్ కూడా సినిమాపై మంచి ఆసక్తిని కలిగిస్తోంది. ఈ చిత్రానికి రవివర్మన్ నీలిమేఘం- సురేష్ భార్గవ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. మసాలా కాఫీ సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కిరణ్ ముద్దం ఎడిటింగ్ వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య సాహిత్యం అందిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Gunde Katha Vintaara First Look Released

Recent Articles English

Gallery

Recent Articles Telugu