కౌబాయ్ గా కనిపించనున్న చరణ్..?

ఒకప్పుడు హాలీవుడ్ లో మాత్రమే వచ్చే కౌబాయ్ సినిమాలు తెలుగు ఇండస్ట్రీకు పరిచయం
చేశారు హీరో సూపర్ స్టార్ కృష్ణ. ఆ తరువాత చిరంజీవి కూడా ‘కొదమసింహం’ అనే కౌబాయ్
సినిమాలో నటించారు. ఈ తరం హీరోల్లో మహేష్ బాబు ‘టక్కరి దొంగ’ అనే కౌబాయ్ తరహా
చిత్రంలో నటించారు. ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా కౌబాయ్ సినిమాలో
నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ కొత్త యువ దర్శకుడు చరణ్ ను
కలిసి ఓ కథ వినిపించాడట. అందులో కొంచెం సమయం కౌబాయ్ లా కనిపించే ఓ ఎపిసోడ్
ఉందట. దాంతో చరణ్ ఆ ఎపిసోడ్ ను కాస్త పెంచి కథను సిద్ధం చేయమని సజేషన్ ఇచ్చాడట.
కొత్త దర్శకుడికి చరణ్ ఛాన్స్ ఇవ్వడంతో ఆయన చెప్పిన విషయాన్ని ఫాలో అవ్వాలని
నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ కొత్త దర్శకుడు గనుక చరణ్ ను మెప్పిస్తే ఇక
త్వరలోనే చరణ్ కౌబాయ్ గెటప్ లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోతాడు!

CLICK HERE!! For the aha Latest Updates