HomeTelugu Trending'కస్టడీ' అప్డేట్‌

‘కస్టడీ’ అప్డేట్‌

Custody update

అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ. ఈ సినిమాలో నాగచైతన్య కానిస్టేబుల్‌ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ ఈ మూవీపై మంచి బజ్‌ని క్రియేట్‌ చేశాయి. అంతేకాక వెంకట్‌ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అంచనాలు తారా స్థాయికి చేరాయి.

ద్విభాషా మూవీగా రూపొందిన ఈ సినిమా మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ఇప్పటి నుంచే ప్రమోషన్స్‌ ప్రారంభించింది. కాగా తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్‌ను ప్రకటించింది.ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ అప్‌డేట్‌ను త్వరలో వెల్లడించనున్నట్లు ఓ చిన్న గ్లింప్స్‌ను విడుదల చేసింది.

ఈ సినిమాకు ఇళయరాజా, యువన్‌ శంకర్‌రాజా ఇద్దరూ స్వరాలు అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస్‌ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తుండగా.. ప్రియమణి కీలకపాత్ర పోషిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu