HomeTelugu Big Storiesపుష్ప: ‘దాక్కో దాక్కో మేక...' సాంగ్‌ వచ్చేసింది

పుష్ప: ‘దాక్కో దాక్కో మేక…’ సాంగ్‌ వచ్చేసింది

Dakka Dakka Make from Pushp

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో, రెండు భాగాలుగా రూపొందుతుంది. తాజాగా మొదటి భాగం నుండి ‘దాక్కో దాక్కో మేక…’ పాటని శుక్రవారం విడుదల చేశారు. ఇందులో బన్ని మాస్‌లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్‏తో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఈ పాటను సింగర్ శివమ్ ఆలపించగా.. చంద్రబోస్ సాహిత్యం అందించారు.

ఐదు భాషల్లో పాట విడుదల కానుంది. తెలుగులో శివం, హిందీలో విశాల్‌ దడ్లాని, కన్నడంలో విజయ ప్రకాష్‌, తమిళంలో బెన్నీ దయాల్‌, మలయాళంలో రాహుల్‌ నంబియార్‌ పాటని ఆలపించారు. ‘పుష్ప’ తొలి భాగాన్ని క్రిస్మస్‌సందర్భంగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. విలన్‌ పాత్రలో ఫహాద్‌ ఫాజిల్‌ నటించారు. ధనుంజయ్‌, అజయ్‌, శత్రు, సునీల్‌, రావు రమేష్‌, అజయ్‌ ఘోష్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu