HomeTelugu Trending'దబాంగ్‌ 3' తెలుగులో ఎప్పుడంటే!

‘దబాంగ్‌ 3’ తెలుగులో ఎప్పుడంటే!

2 18

తొలిసారి సల్మాన్‌ ఖాన్‌ నటించిన సినిమా దక్షిణాది భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఆయన హీరోగా నటిస్తున్న ‘దబాంగ్‌ 3’ సినిమా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ బాధ్యతలను సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తీసుకుంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా హీరోయిన్‌. సగానికి పైగా చిత్రీకరణ పూర్తైంది. 2010లో ‘దబాంగ్‌’ సినిమా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన ‘దబాంగ్‌ 2’ కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిత్రాన్ని ఫ్రాంచైస్‌గా మార్చారు. డిసెంబర్‌ 20న ‘దబాంగ్‌ 3’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు సల్మాన్‌.. ‘కిక్‌2’, ‘ఇన్‌షాఅల్లా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu