‘దాస్ కా ధమ్కీ’ మూవీ ట్రైలర్‌


టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. ఇది విశ్వక్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ట్రైలర్ ని ఆవిష్కరించారు.

ఈ ట్రైలర్ ని నందమూరి బాలకృష్ణ విడుదల చేసి మూవీ యూనిట్‌కి విషెస్‌ తెలిపారు. విశ్వక్ సేన్ డబుల్ రోల్ లో కనిపించిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఒకరు వెయిటర్ గా కనిపిస్తే.. మరొకరు సంపన్న ఫ్యామిలీకి చెందిన వ్యక్తిగా కనిపించారు. విశ్వక్ సేన్ ఇందులో డబుల్ యాక్షన్ లో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో రావు రమేశ్, రోహిణి, అజయ్, హైపర్ ఆది, మహేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తరుణ్ భాస్కర్ కూడా స్పెషల్ రోల్ లో కనిపించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ పతాకాలపై కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates