HomeTelugu Trendingఎన్టీఆర్‌ ఫేమ‌స్ సీన్‌తో డేవిడ్‌ వార్నర్‌.. వీడియో వైరల్‌

ఎన్టీఆర్‌ ఫేమ‌స్ సీన్‌తో డేవిడ్‌ వార్నర్‌.. వీడియో వైరల్‌

David warner with jr ntr vi
ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ వరుసగా టాలీవుడ్‌ హీరోల వీడియోలతో టిక్‌టాక్‌ వీడియోలు చేస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ టైమ్‌లో ఇంటికే ప‌రిమితమైన డేవిడ్‌ ప‌లు టిక్ టిక్ వీడియోలు చేసి తెలుగు ప్రేక్షకులను అల‌రించాడు. నెల‌న్న‌ర పాటు ఐపీఎల్‌తో బిజీగా ఉన్న వార్న‌ర్ కు ఇప్పుడు కాస్త బ్రేక్ దొరికింది. దీంతో అర‌వింద స‌మేత‌లోని ఫేమ‌స్ సీన్‌లో ఎన్టీఆర్ ఫేస్‌ని త‌న ముఖంతో మార్ఫింగ్ చేసి వీడియో షేర్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా, వార్న‌ర్ తాజాగా అల్లు అర్జున్‌కు బెస్ట్ విషెస్ అందించిన సంగ‌తి తెలిసిందే. బుట్టబొమ్మ‌ సాంగ్ 450 మిలియన్ వ్యూస్ దక్కించుకోగా డేవిడ్ వార్నర్ బన్నీకు తన ఇస్టాగ్రామ్‌ ద్వారా వెల్డన్ అంటూ స్టేటస్ పెట్టాడు.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

Recent Articles English

Gallery

Recent Articles Telugu