HomeTelugu Trendingఅక్కినేని నాగార్జున ఫాంహౌస్‌లో డెడ్‌ బాడీ

అక్కినేని నాగార్జున ఫాంహౌస్‌లో డెడ్‌ బాడీ

7 17
అక్కినేని నాగార్జునకు చెందిన వ్యవసాయక్షేత్రంలో కుళ్లిపోయిన మృతదేహం కనిపించడం సంచలనం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట గ్రామంలో అక్కినేని నాగార్జునకు వ్యవసాయ క్షేత్రం ఉంది. పాపిరెడ్డిగూడలోని 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తన వ్యవసాయక్షేత్రంలో నాగార్జున సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. వ్యవసాయసాగు కోసం అధ్యయనం చేసేందుకు నిపుణుల బృందాన్ని అక్కడికి పంపించారు. ఈ మధ్య నాగార్జున, అమల కూడా అక్కడ మొక్కలు నాటారు. వ్యవసాయసాగు కోసం అక్కడకు వెళ్లిన నిపుణులకు ఓ గదిలో కుళ్లిపోయిన శవం కనిపించడం కలకలం రేపింది. కుళ్లిపోయిన అస్తిపంజరాన్ని చూసి అంతా షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతుడి వివరాలు వెల్లడించారు.

నాగార్జున ఫాంహౌస్‌లో దొరికిన మృతదేహం కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన పాండు అనే వ్యక్తిగా గుర్తించారు. అస్తిపంజరం మీదున్న దుస్తులు, బెల్ట్ ఆధారంగా పాండు కుటుంబసభ్యులు ఆయన్ని గుర్తుపట్టారు. ఇదిలా ఉంటే మూడేళ్ల కిందట పాండు కనిపించకుండా పోయాడు. అప్పటికే అన్నయ్య కుమార్ కిడ్నీ సంబంధిత వ్యాధితో చనిపోవడంతో బాగా మనస్తాపానికి గురయ్యాడు పాండు. పైగా ఆర్థిక పరిస్థితి బాగోలేక తన వ్యవసాయ భూమిని కూడా అమ్మాల్సి రావడంతో తీవ్ర మనోవేదన చెందాడని చెబుతున్నారు గ్రామస్తులు. అదే సమయంలో తన భూమి పక్కనే ఉన్న వ్యవసాయ క్షేత్రంలోని ఓ గదిలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు పోలీసులు. అది నాగార్జున పొలం కావడంతో విషయం హైలైట్ అయింది. పాండు అస్తిపంజరం పక్కనే ఉన్న పురుగుల మందు డబ్బాను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుడు ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో పాండు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu