HomeTelugu Trending'ప్రాజెక్ట్‌ కే' నుండి దీపికా ఫస్ట్‌లుక్‌

‘ప్రాజెక్ట్‌ కే’ నుండి దీపికా ఫస్ట్‌లుక్‌

Deepika Padukones intense first look from Project K revealed

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ క్రేజియెస్ట్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొణేకి చెందిన ఫస్ట్ లుక్ ను నిన్న రాత్రి మేకర్స్ విడుదల చేశారు. ఇందులో దీపిక ఎంతో సీరియస్ గా కనిపిస్తోంది. ఆమె ఫస్ట్ లుక్ చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉందని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా టైటిల్ ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

రేపటి నుంచి యూఎస్ లోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకలు జరగనున్నాయి. అక్కడే ఈ నెల 20న సినిమా టైటిల్ తో పాటు, గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపిక, నాగ్ అశ్విన్, అశ్వనీదత్ పాల్గొననున్నారు. మరోవైపు ‘ప్రాజెక్ట్ కే’లో ‘కే’ అంటే కాలచక్రం అనే ప్రచారం జరుగుతోంది. ఇదే టైటిల్ ను ఫిక్స్ చేయొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu