HomeTelugu Trendingప్రభాస్‌తో రొమాన్స్‌కు భారీగా డిమాండ్ చేసిన దీపికా‌!

ప్రభాస్‌తో రొమాన్స్‌కు భారీగా డిమాండ్ చేసిన దీపికా‌!

6 14
టాలీవుడ్‌ యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తాజాగా రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌ తన 21వ సినిమా.. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబందించి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మించనున్నాడు. భారీ హంగులతో నిర్మించి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ప్రభాస్‌కు జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఈ మేరకు దీపికకు కథ కూడా నేరేట్ చేశారని, ఆమె ఈ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని వార్తలు వినిపిస్తుంది. అయితే ఈ అమ్మడు 20 నుంచి 25కోట్ల వరకు డిమాండ్ చేసిందట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu