HomeTelugu Big Storiesస్టేజ్‌పై కన్నీటి పర్యంతమైన దీపిక..

స్టేజ్‌పై కన్నీటి పర్యంతమైన దీపిక..

7 24
బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె.. అభిమానులు తనపై చూపించిన ప్రేమకు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం దీపిక ‘ఛపాక్‌’ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతున్నారు. ఇందులో భాగంగా ఆమె ‘డ్యాన్స్‌ ప్లస్‌’ రియాల్టీ షోకు అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్‌ దీపిక నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ చిత్రాల నుంచి కొన్ని పాటలతో ఆమె కోసం ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. ప్రదర్శన పూర్తవగానే దీపిక డ్యాన్సర్లకు నిల్చుని అభివాదం చేశారు. అనంతరం స్టేజ్‌ పైనే నిల్చుని వెక్కి వెక్కి ఏడ్చేశారు. దీంతో అక్కడే ఉన్న దర్శకుడు రెమో డిసౌజా ఆమెను ఓదార్చారు.

కంటెస్టెంట్స్‌ ఇచ్చిన ప్రదర్శనపై స్పందించిన దీపిక.. ‘ఎప్పుడూ నా కెరీర్‌ గురించి నేను ఆలోచించలేదు. నాకు నచ్చిన కథలను చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ రోజు మీ అందరి వల్ల నా కెరీర్‌ను చూసుకునే అవకాశం వచ్చింది. మిమ్మల్ని అలరించడంలో నావంతు పాత్రను పోషించానని భావిస్తున్నాను’ అని అన్నారు. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన చిత్రం ‘ఛపాక్‌’. మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

https://www.instagram.com/tv/B6iOVGVAQuY/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu