HomeTelugu Trendingగోవాలో యాక్షన్ సీన్స్ షూటింగ్‌లో దేవర

గోవాలో యాక్షన్ సీన్స్ షూటింగ్‌లో దేవర

 

Devara action scenes shooti 1జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దేవర’ ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అభివృద్ధి చెందని ఓ తీర ప్రాంతం నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.

తమకు భయం తెలియదంటూ విర్రవీగే వారికి భయాన్ని పరిచయం చేసే పవర్‌ఫుల్‌ పాత్రలో తారక్‌ కనిపించనున్నారు. తొలిభాగం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో యాక్షన్‌కి చాలా ప్రాధాన్యత వుంది. ప్రస్తుతం గోవాలో కొన్ని హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ షూట్‌ చేస్తున్నారు.

ఇందులోని యాక్షన్‌ సన్నివేశాల కోసం హాలీవుడ్‌ కొరియోగ్రాఫర్స్ పని చేస్తున్నారు. గోవాలో షూటింగ్పూర్తి కాగానే మూవీ యూనిట్‌ గోకర్ణ షిప్ట్‌ కానుంది. అక్కడ భారీ సెట్‌ వేసి కొన్ని సన్నివేశాలు షూట్ చేయనున్నారు.

దేవర మూవీ టీమ్ ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్లతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంతో జాన్వీ కపూర్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతోంది. ఈ మూవీలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా నటిస్తున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu