HomeTelugu Big Stories'డెవిల్‌' టీజర్‌

‘డెవిల్‌’ టీజర్‌

Devil Glimpse

నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్‌’. ఈ సినిమాను దర్శకుడు నవీన్‌ మేడారం తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు ఈ సినిమాపై అంచనాలు క్రియేట్‌ చేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ రిలీజైంది. స్వాతంత్రానికి ముందు కళ్యాణ్‌రామ్‌ బ్రిటీషర్‌లకు సీక్రెట్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఆయన పేరు, రూపు రేఖలు ఎవరికీ తెలియదు. అయితే దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా బ్రిటీషర్ల కోసం డెవిల్‌ ఎందుకు పని చేశాడు? దాని వెనుక ఉన్న రహస్య మిషన్ ఏంటి? వంటి పలు ప్రశ్నలతో టీజర్‌ను నవీన్‌ మేడారం అద్భుతంగా కట్‌ చేశాడు.

ఈ టీజర్‌ చూస్తుంటే ఈ సారి కళ్యాణ్‌రామ్‌ మరో హిట్ కొట్టేలానే కనిపిస్తున్నాడు. లుక్స్‌ పరంగా కళ్యాణ్‌ రామ్‌ ఆకట్టుకుంటున్నాడు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది. ఈ సినిమాలో సంయుక్త మీనన్-మాళవిక నాయర్ హీరోయిన్‌లుగా నటించింది. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ సినిమాను నిర్మించాడు. తాజాగా 500 మంది ఫైటర్స్తో ఓ యాక్షన్ ఎపిసోడ్ కూడా చిత్రీకరించారు. ఈ సినిమాకు ఇది హైలైట్ గా నిలుస్తుందని టాక్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu