HomeTelugu Trendingఇళయరాజా బయోపిక్‌లో ధనుష్‌

ఇళయరాజా బయోపిక్‌లో ధనుష్‌

Dhanush in Ilayaraja biopic

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ధనుష్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి అభిమానులు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ధనుష్‌ మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్‌లో నటించబోతున్నారన్న న్యూస్ ఒకటి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. 2024లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని, 2025లో థియేటర్లలో సందడి చేయనుందని నెట్టింట న్యూస్ హల్‌ చల్ చేస్తోంది.

ఈ సినిమాను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించనుందట. అయితే దీనిపై ధనుష్‌ నుంచి కానీ, ఇళయరాజా కాంపౌండ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఆ కథపై ధనుష్ ఆసక్తి గా ఉన్నట్లు సమాచారం.

ధనుష్ కు ఇలాంటి ప్రయోగాలంటే చాలా ఇష్టం అతని కెరీర్ లో కొన్ని మాస్ ఎలివేషన్ లేని సినిమాలు కూడా బాగానే క్లిక్ అయ్యాయి.

ఇక ఇళయరాజా సంగీత జీవితంలో ధనుష్ పాత్ర ఏ విధంగా ఉంటుంది? దాన్ని మేకర్స్ ఎలా తెరపైకి తీసుకు వస్తారు అనే దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ ఓటీటీ ప్రాజెక్టు తరహాలో వెబ్ సిరీస్ ప్లాన్ చేసిన కూడా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu