HomeTelugu Big Storiesధనుష్‌ 'సార్‌' టీజర్‌ విడుదల

ధనుష్‌ ‘సార్‌’ టీజర్‌ విడుదల

Dhanush SIR movie Teaser
త‌మిళ స్టార్‌ హీరో ధ‌నుష్ నటించిన తాజా చిత్రం ‘సార్’. ద్విభాష చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాకి వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం నుండి మేకర్స్ తాజాగా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

ఈ టీజ‌ర్ మొత్తం ధ‌నుష్ వ‌న్ మ్యాన్ షోలా కనిపిస్తుంది. లెక్చ‌ర‌ర్‌గా ధ‌నుష్ యాక్ష‌న్ సీన్లు వేరే లెవల్లో ఉన్నాయి. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. జీవి. ప్ర‌కాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్టైన‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్ర‌స్తుతం ధ‌నుష్ న‌టించిన తిరుచిత్రంబ‌లం, నానే వ‌రువ‌న్..విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈయ‌న న‌టించిన హాలీవుడ్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu