HomeTelugu Trendingనాగ చైతన్య 'దూత' స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

నాగ చైతన్య ‘దూత’ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌

dhootha web series streamin
అక్కినేని నాగ చైతన్య కూడా వెబ్ సిరీస్‌ల్లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఆయన ‘దూత’ అనే వెబ్ సిరీస్ ను చేశాడు. కొంతకాలం క్రితమే ఈ సిరీస్ షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ ను ఈ డిసెంబర్ 1వ తేదీ నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు చెబుతూ, కొంతసేపటి క్రితమే పోస్టర్ ను రిలీజ్ చేశారు.

నాగచైతన్య ఫస్టు వెబ్ సిరీస్ ఇది. హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడుస్తుంది. తాజాగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా చేసిన చైతూ, ఆ వెంటనే ఆయన దర్శకత్వంలోనే వెబ్ సిరీస్ చేయడం విశేషం.

ఈ సిరీస్ లో పార్వతి తిరువోతు .. ప్రియా భవాని శంకర్ .. ప్రాచీ దేశాయ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. చైతూ జర్నలిస్టుగా కనిపించనున్న ఈ సిరీస్ లో సీజన్ 1లో భాగంగా 8 ఎపిసోడ్స్ ను వదలనున్నట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

20231115fr655479955f181

Recent Articles English

Gallery

Recent Articles Telugu