HomeTelugu Trending'ధృవ నక్షత్రం' విడుదల వాయిదా

‘ధృవ నక్షత్రం’ విడుదల వాయిదా

Dhruva Nakshatra release

తమిళ హీరో విక్రమ్‎ హీరోగా డైరెక్టర్ గౌతమ్‌ మీనన్ దర్శకత్వంతో రూపొందుతున్న ‘ధృవ నక్షత్రం’ రిలీజ్ మరోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రకటించారు. ‘ధృవ నక్షత్రం’ సినిమాను ఐదేళ్ల క్రితమే షూటింగ్ ప్రారంభమైన ఆర్థిక ఇబ్బందులతో ఆలస్యమైంది.

ధృవ నక్షత్రం మూవీని ఎట్టకేలకు నవంబర్ 24న విడుదల చేస్తున్నట్లు దర్శకుడు గౌతమ్ మీనన్ గతంలో ప్రకటించారు. ఇప్పటికైనా సినిమా విడుదలవుతుందని విక్రమ్ అభిమానులు ఎదురుచూశారు. ఈ మూవీకి ప్రమోషన్లు కూడా పెద్దగా చేపట్టలేదు.

తాజాగా మరోసారి ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదల వాయిదా పడింది. స్వయంగా దర్శకుడు, నిర్మాత అయిన గౌతమ్ మీనన్ వెల్లడించాడు. ‘ధృవ నక్షత్రం’ సినిమాని థియేటర్స్ లోకి తీసుకురాలేకపోయినందుకు క్షమించండి. మాకు ఇంకో ఒకటి రెండు రోజుల సమయం పడుతుందని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని రోజుల్లో వచ్చేస్తాం, మీకు ఈ సినిమా అనుభూతిని మంచి థియేటర్స్ లో చూపిస్తాము,’ అనుకుంటూ రాసుకొచ్చాడు.

ఈ సినిమాలో జాన్‌గా విక్రమ్ నటిస్తున్నాడు. ఇది ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇందులో విక్రమ్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్, దివ్యదర్శిని కీలక పాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu