HomeTelugu Trendingబేబి బంప్‌తో బాలీవుడ్‌ నటి!

బేబి బంప్‌తో బాలీవుడ్‌ నటి!

Dia mirza baby bump pic vir

ప్రముఖ బాలీవుడ్‌ నటి దియా మీర్జా తన అభిమానులకు ఒక తీపికబురు ను పంచుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోముంబైకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీని వివాహం చేసుకున్న దియా తను తల్లి కాబోతున్నానన్న విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె బేబి బంప్ ఉన్న ఫొటోను గురువారం ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. భర్త వైభవ్ రేఖీతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తుంది. తన జీవితంలో ఎంతో ఎమోషనల్ సందర్భాన్ని పురస్కరించుకుని దియా ఈ ఫోటోకి ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు. “ఆశీస్సులు అందుకుంటున్నా… ఈ భూమాతపై నేను ఒకరిని. జీవితం ఎంతో శక్తివంతం.. ఇది ప్రకాశవంతమైన ఆరంభం..’ అంటూ పోయెటిక్ గా దియా ఎమోషనల్ అయ్యారు.

దీంతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, షిబాని దండేకర్, తాహిరా కశ్యప్, మహీప్ కపూర్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా తదితరులతోపాటు అభిమానులనుంచి కూడా దియాకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఇప్పటికే మిలియన్ల లైక్‌లను ఈ పోస్ట్‌ సొంతం చేసుకోవడం విశేషం.

https://www.instagram.com/p/CNIATcpjlOt/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu