HomeTelugu TrendingF3 లో పవన్ కళ్యాణ్ :దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

F3 లో పవన్ కళ్యాణ్ :దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Will Pawan Kalyan Talk About Ticket Prices GO?

వెంకటేశ్ – వరుణ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా ‘ఎఫ్ 3’ సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా అందాల సందడి చేసే ఈ సినిమాను,   రేపు అంటే ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో మెహ్రీన్ .. సోనాల్ చౌహాన్ .. పూజ హెగ్డేకి మించి తమన్నా గ్లామర్ ఒలకబోసినట్టుగా పాటలను బట్టి తెలుస్తోంది. ఈ సినిమాపై అందరూ మంచి ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు.ది.

సినిమా విడుదల సందర్భంగా మూవీ యూనిట్ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు, జబర్దస్త్ కమెడియన్ గెటప్ శీను విజయవాడలో జరిగిన మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఎఫ్ 3 సినిమా గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు . ఎఫ్ 3 లో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నటించారు అని చెప్పారు .. పవన్ తో పాటు టాలీవుడ్ అగ్ర హీరోలు తో ఎపిసోడ్ ఉంటుంది అని విజయవాడ లో  ఎఫ్ 3 ప్రమోషన్ లో భాగంగా చెప్పుకొచ్చాడు ..

Recent Articles English

Gallery

Recent Articles Telugu