HomeTelugu TrendingF3 నెగటివ్‌ టాక్‌పై దర్శకుడు అనిల్‌ రావిపూడి అసహనం

F3 నెగటివ్‌ టాక్‌పై దర్శకుడు అనిల్‌ రావిపూడి అసహనం

Anil Ravipudi to do a multi-starrer next?

అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన `ఎఫ్‌3` సినిమా శుక్రవారం విడుదలైంది. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా నటించారు. సోనాల్‌ చౌహాన్‌ కీలక పాత్ర చేశారు. మనీ నేపథ్యంలో వచ్చే ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. దిల్‌రాజు నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదలైన నేపథ్యంలో పాజిటివ్‌ టాక్‌ వస్తోందని చెబుతోంది యూనిట్‌. ఈ మేరకు మధ్యాహ్నం టీమ్‌ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు. అంతకు ముందు పలు థియేటర్లలో సందడి చేశారు.

సినిమా నెగటివ్‌ టాక్‌లపై దర్శకుడు అనిల్‌ రావిపూడిస్పందించారు. ఆయన అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం వచ్చిందంటే సినిమాకి ఎలాంటి టాక్‌ వస్తుందో అనే భయం స్టార్ట్ అయ్యిందని, ప్రతి సినిమాకి నెగటివిటీ ఎక్కువైపోయింద`ని తెలిపారు. నవ్వుకునే సినిమా వచ్చింది. ప్రశాంతంగా నవ్వుకోండని, పాజిటివ్‌గా ఉండాలని, అనసవరంగా అది తక్కువ, ఇది తక్కువ అంటూ లాజిక్‌లు వెత్తుక్కోవడం ఎందుకు.సినిమాకి వెళ్లి హ్యాపీగా నవ్వుకోవాలని, నో లాజిక్‌ ఓన్లీ మ్యాజిక్‌` అని తెలిపారు దర్శకుడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu