HomeTelugu Newsమెగాస్టార్‌ పై దర్శకేంద్రుడు పొగడ్తల వర్షం

మెగాస్టార్‌ పై దర్శకేంద్రుడు పొగడ్తల వర్షం

13మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా’ సినిమా గురించి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంది వ్యక్తులు ట్వీట్ చేస్తున్నారు. సినిమా గురించిన విషయాలను పంచుకున్నారు. చిరంజీవి నటన గురించి మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తున్నారు. రాజమౌళి నుంచి నాని వరకు అందరూ ట్వీట్ చేశారు. వీరందరికి మెగాస్టార్ పేరు పేరున ధన్యవాదాలు తెలిపాడు. ఇదిలా ఉంటె, సైరా సినిమా గురించి దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ట్వీట్ చేశారు.

చిరంజీవి తనకు చాలా కాలం నుంచి తెలుసునని, మెగాస్టార్ సినిమాను శ్రద్ధపెట్టి చేస్తారని చెప్పారు. సైరా పాత్రలో చిరంజీవి నటన అమోఘం అన్నారు. మెగాస్టార్ తో పాటు తమన్నాను కూడా రాఘవేంద్రరావు పొగడ్తల వర్షం కురిపించారు. సాంగ్ లో తమన్నా నటన అమోఘం అని, తమన్నా పాత్ర సినిమాకు ప్లస్ అయిందని అన్నారు. సురేందర్ రెడ్డి కష్టం సినిమాలో కనిపించిందని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu