మహేష్ సినిమాలో ఇలియానా..?

ఒకప్పుడు తెలుగు అగ్ర హీరోయిన్ గా వెలుగొందింది ఇలియానా. పవన్ కల్యాణ్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. తెలుగులో ఎంత పేరొచ్చినా.. హిందీలో కూడా తన సత్తా చాటాలనుకుంది. దీంతో బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ తన అధృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో ఆమెకు నిరాశే ఎదురైంది. అయిన పట్టు వదలకుండా అవకాశాలు దక్కించుకుంటోంది. మళ్ళీ తెలుగు ప్రేక్షకులను పలకరించాలని ఉందని ఇక్కడ దర్శకనిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. ఇప్పుడు ఆమె ప్రయత్నాలు ఫలించాయని అంటున్నారు.

మహేష్ సరసన ఓ సినిమా నటించే అవకాశం కొట్టేసిందట. ప్రస్తుతం మహేష్-కొరటాల కాంబినేషన్ లో ఓ సినిమా
రూపొందుతోంది. దీని తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు మహేష్. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఇటీవలే మొదలయ్యాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇలియానాను సంప్రదించగా.. ఆమె అంగీకరించిందని చెబుతున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో.. మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.