HomeTelugu Trendingస్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ బర్త్‌డే సెలబ్రెషన్స్‌

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ బర్త్‌డే సెలబ్రెషన్స్‌

Director Shankar birthday c

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్టులను తెరక్కెకిస్తున్నారు. గేమ్‌ ఛేంజర్‌, ఇండియన్ 2. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నాడని తెలిసిందే. ఇప్పటికే గేమ్‌ ఛేంజర్‌ సెట్స్‌లో రామ్‌చరణ్‌ అండ్‌ దిల్ రాజు టీం శంకర్ బర్త్‌ డే వేడుకలు నిర్వహించింది. తాజాగా తమ కెప్టెన్‌కు బర్త్ డే విషెస్‌ చెప్పడానికి ఇండియన్ 2 టీం అంతా ఒక్క చోట చేరింది.

ప్రియమైన శంకర్‌ జీ.. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. అంటూ సెట్స్‌లో శంకర్‌తో డిస్కస్ చేస్తున్నపుడు తీసిన స్టిల్‌ను షేర్ చేశాడు కమల్ హాసన్‌. అనంతరం లైకా ప్రొడక్షన్స్ టీం శంకర్‌తో కేక్‌ కట్‌ చేయించి విషెస్ తెలియజేసింది. ఇప్పుడీ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

పాన్ ఇండియా కథాంశంతో కమల్‌ హాసన్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఇండియన్‌ 2లో ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తుండగా.. బాబీ సింహా, సిద్దార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, స‌ముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu