HomeTelugu Big Storiesకిమ్‌ స్థానంలో సోదరి.. మరింత క్రూరంగా పాలన!

కిమ్‌ స్థానంలో సోదరి.. మరింత క్రూరంగా పాలన!

5a 2
ఉత్తర కొరియా లీడర్‌ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఆరోగ్యం విషమించిందన్న వార్తల నేపథ్యంలో ఆయన స్థానంలో ఎవరు పగ్గాలు చేపట్టబోతున్నారు అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది. దాదాపు ఏడు దశాబ్దాలుగా అక్కడ వంశపారపర్య పాలనే కొనసాగుతుంది. ఈ క్రమంలో కిమ్‌ కుమారుడు లేదా సోదరుడు గద్దెనెక్కుతారని భావించినా.. కిమ్‌ పిల్లలు ఇంకా చిన్నవాళ్లు కావడం, సోదరులతో ఆయనకు సఖ్యత లేకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి కిమ్‌ సోదరి కిమ్‌ యో జాంగ్‌పై పడింది. కిమ్‌కు అత్యంత సన్నిహితురాలిగా పేరొందిన ఈమె‌.. ప్రస్తుతం అధికార వర్కర్స్‌ పార్టీ ఆఫ్‌ కొరియా ప్రత్యామ్నాయ పొలిట్‌ సభ్యురాలిగా ఇటీవలే ఎన్నికయ్యారు. అంతేకాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధినేత జిన్‌పింగ్‌లతో కిమ్‌ సమావేశమైన పలు సందర్భాల్లో సోదరుడి వెంటే ఉండి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దక్షిణ కొరియాను డైరెక్ట్ గా కుక్కలు మొరుగుతున్నాయని హెచ్చరించిన వైనం చూస్తుంటే ఆమె ఎంతటి సమర్దురాలో అర్ధం చేసుకోవచ్చు.

కరోనా విషయంలో కలిసి పనిచేద్దామని ట్రంప్ లేఖ రాస్తే, దానికి ఆమె ఇచ్చిన సమాధానం చాలు ఆమె ఎంతటి కఠినమైన నాయకత్వం కలిగిన నాయకురాలో చెప్పడానికి.  కిమ్ తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఆమె హస్తం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  హెచ్చరికలు చేయడంలో, శతృవులను భయపెట్టడంలో, ప్రజలను నడిపించడంలో ఆమె ఆరితేరిందని, దేశాన్ని పరిపాలించదగిన సత్తా కిమ్ యో జోంగ్ కు ఉందని అంటున్నారు.

ఈ క్రమంలో సోదరుడి మాదిరే నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న జాంగ్‌కే అధికారం చెయ్యపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మెజారిటీ వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ విషయంపై సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ సైతం తనదైన శైలిలో కామెంట్‌ చేశారు.

‘‘కిమ్‌ జోంగ్‌ అనంతరం అతడి సోదరి అధికారం చేపడతారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆమె అతడి కంటే మరింత క్రూరురాలు అయితే… ఈ ప్రపంచం మొదటి ఆడ విలన్‌ను చూస్తుంది’’ అని వర్మ ట్వీట్‌ చేశారు. ఇందుకు స్పందనగా.. భారతీయ భర్తలకు లేడీ విలన్లంటే భయం లేదని.. ఎందుకంటే రోజూ ఇంట్లో ప్రత్యక్ష విలన్లను చూస్తున్నామంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంత మంది మాత్రం.. కిమ్‌ యో జాంగ్‌ చూపులను గమనిస్తే… ఆమె కిమ్‌కు ఏమాత్రం తీసిపోరని అనిపిస్తోందని… కిమ్‌ బతికి ఉంటే బాగుండు అని కామెంట్లు చేస్తున్నారు.

5 24

Recent Articles English

Gallery

Recent Articles Telugu