ధూమ్‌ ధాం దోస్తాన్‌.. సాంగ్‌తో దుమ్ములేపుతున్న నాని


నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా ‘దసరా’. ఈ సినిమాపై ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తోంది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి భారీగా బడ్జెట్ పెట్టి నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ తాజా అప్డేట్‌ విడుదలైంది. ఈ చిత్రంలోని ధూమ్ ధాం దోస్తాన్ ఇరగ మరగ చేద్దాం అంటూ సాగే వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ పాట మాస్ ప్రేక్షుకులను ఆకట్టుకునే విధంగా మస్తుంది.

ఇందులో నాని లుక్ అదిరిపోయింది. సిల్క్ స్మిత పెయింటింగ్ ఈ పాటలో హైలైట్‌. ధూమ్ ధాం దోస్తాన్ ఇరగ మరగ చేద్దాం అంటూ నాని మాస్ మసాలా రేంజ్ దుమ్ము రేపుతాడు. ఈ పాటకు కాసర్ల శ్యాం ఈ పాటకు లిరిక్స్ రాయగా… రాహుల్ సిప్లిగంజ్ గొట్టె కనకవ్వ గన్నోర దాస లక్ష్మి పాలమూరు జంగిరెడ్డి నర్సన్న (నల్గొండ గద్దర్) ఈ పాటను ఆలపించారు.

ఈ పాట సినిమాపై మరింత అంచనాలు పెంచేస్తుంది. దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్ వంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు. సత్యం సూర్య సినిమాటోగ్రఫీ నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. మార్చి 30వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates