HomeTelugu Trending'అరణ్య'లో ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా!

‘అరణ్య’లో ఈ నటుడు ఎవరో గుర్తుపట్టారా!

10 8
స్టార్‌ కిడ్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి. మొదటిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా బహుముఖ పాత్రలు చేసి మెప్పించిన నటుడు రానా. కేవలం తెలుగు చిత్రాలకే పరిమితం కాకుండా.. తమిళ్, మలయాళం, హిందీ సినిమాల్లో వరసగా నటిస్తున్నాడు. ఆయన తాజా చిత్రం నటిస్తున్న చిత్రం ‘హాథీ మేరే సాథీ’. తెలుగులో ‘అరణ్య’ పేరుతో, తమిళంలో ‘కాదన్’ గా వస్తోంది.

ఈ వేసవిలో మూడు భాషల్లో ఒకేసారి విడుదలౌతుంది. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో ఏప్రిల్ 2న రిలీజ్‌ చేస్తున్నారు. ఎరోస్ ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో జోయా హుస్సేన్, శ్రియా ల్గావ్ కర్, పులకిత్ సామ్రాట్ ఇతర పాత్రధారులు. తాజాగా ‘హాథీ మేరే సాథీ’ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో రానా గెటప్ విలక్షణంగా కనిపిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu