HomeTelugu News'ఖైదీ నంబ‌ర్ 150' సెట్లో విదేశీ మేయ‌ర్!

‘ఖైదీ నంబ‌ర్ 150’ సెట్లో విదేశీ మేయ‌ర్!

మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ నాయ‌కానాయిక‌లుగా వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఖైదీ నంబ‌ర్ 150’ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పాట‌ల చిత్ర‌ణ‌కు యూర‌ప్ ట్రిప్ వెళ్లింది యూనిట్‌. అక్క‌డ క్రొయేషియా, స్లోవేనియా వంటి ఎగ్జాటిక్ లొకేష‌న్ల‌లో చిత్రీక‌ర‌ణ సాగుతోంది. అయితే ఆన్‌లొకేష‌న్‌కి ఓ అనుకోని అతిధి వ‌చ్చి మెగాస్టార్ చిరంజీవి, కాజ‌ల్ స‌హా యూనిట్‌ని ప‌ల‌క‌రించారు. అంతేనా త‌మ దేశంలో త‌మ లొకేష‌న్‌లో షూటింగ్ చేస్తున్నంద‌కు ఎంతో సంతోషిస్తూ.. కృత‌జ్ఞ‌తాభినంద‌న‌లు తెలిపారు. ఖైదీ నంబ‌ర్ 150 చిత్రానికి ఉన్న పాపులారిటీని, క్రేజును అడిగి మ‌రీ తెలుసుకున్నారు. అస‌లింత‌కీ ఎవ‌రా అతిధి..? అంటే డుబ్రొవోనిక్ మేయ‌ర్ ఆండ్రూ వ్లాహుసిక్. అంతేకాదు .. డుబ్రొవోనిక్ వ‌చ్చి షూటింగ్ చేస్తున్నందుకు మెగాస్టార్‌కి, కాజ‌ల్ స‌హా యూనిట్‌కి థాంక్స్ చెప్పారు. మేయ‌ర్ స్వ‌యంగా మెగాస్టార్ చిరంజీవిగారిని క‌లిసి విష్ చేయ‌డ‌మే కాకుండా ఓ గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఇండియ‌న్ సినిమా అంటే త‌న‌కి ఉన్న అభిమానం గురించి మేయ‌ర్‌ మాట్లాడారు.. డుబ్రొవోనిక్ టూరిజం అభివృద్ధికి ‘ఖైదీ నంబ‌ర్ 150’ షూటింగ్‌ సాయ‌ప‌డుతుంద‌న్నారు. డుబ్రొవోనిక్‌లో చిత్ర‌ యూనిట్‌కి ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప్ర‌త్యేకించి మేయ‌ర్ కేర్ తీసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu