కృష్ణను పరామర్శించిన చంద్రబాబు

ప్రముఖ సినీనటుడు కృష్ణను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల కృష్ణ సతీమణి విజయనిర్మల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి వచ్చిన చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్‌, బాలకృష్ణ, బుద్దా వెంకన్న, గల్లా జయదేవ్‌ తదితరులు కృష్ణను పరామర్శించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ‘విజయనిర్మల మరణవార్తవిని షాక్‌కు గురయ్యా. సినిమాల పరంగానేగాక రాజకీయంగానూ సన్నిహితురాలు. 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున కైకలూరు నియోజకవర్గం నుంచి విజయనిర్మల పోటీ చేశారు’ అని చంద్రబాబు గుర్తు చేశారు.