ఈ భామ కూడా రెమ్యూనరేషన్ పెంచేసింది!

ఈ భామ కూడా రెమ్యూనరేషన్ పెంచేసింది!
కెరీర్ లో సరైన హిట్ సినిమా లేకపోయినా.. వరుస అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘జ్యో అచ్యుతానంద’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అవి కాకుండా అమ్మడు చేతిలో నాలుగైదు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళంలో కూడా నటిస్తోంది. హిందీలో కూడా ఓ అవకాశాన్ని దక్కించుకుంది. దీంతో అమ్మడు క్రేజ్ పెరిగిందని రెమ్యూనరేషన్ డబుల్ చేసెసింది. ఇప్పటివరకు రెజీనా అరవై లక్షల రెమ్యూనరేషన్ తీసుకునేది. కానీ ఇప్పుడు తన డిమాండ్ పెరిగిందని సుమారుగా 1.5 కోట్లు రెమ్యూనరేషన్ గా అడుగుతుందట. మొదట దర్శకనిర్మాతలు వెనుకడుగు వేసిన మరో అవకాశం లేక అడిగినంత ఇస్తున్నారట. క్రేజ్ ఉన్నప్పుడు రెమ్యూనరేషన్ పెంచడం లేనప్పుడు తగ్గించుకోవడం మన తారలకు అలవాటే.. కదా ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏది లేదు.  
CLICK HERE!! For the aha Latest Updates