చిరు సినిమాకు మరో రైటర్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా ఓ రీమేక్ చిత్రమన్న సంగతి తెలిసిందే.
అయితే అది రీమేక్ సినిమాగా కాకుండా ఓ కొత్త చిత్రంగా ప్రేక్షకులకు అందించాలని చిత్రబృందం చాలా
కష్టపడుతున్నారు. ముందుగా పరుచూరి బ్రదర్స్ సినిమాను తెలుగులో అనువదించగా.. ఆ తరువాత
రైటర్ ఆకుల శివ కొంత భాగానికి మాటలు రాశారు. సినిమాలో ముఖ్యమైన ఎమోషన్ సన్నివేశాలు
రాయడానికి సాయి మాధవ్ బుర్రాను రంగంలోకి దింపారు. ఇప్పుడు కొత్తగా మరో యువ దర్శకుడు
కూడా ఈ సినిమాలో డైలాగ్స్ రాస్తున్నాడని సమాచారం. సుకుమార్ వద్ధ శిష్యరికం చేసిన హుస్సేన్ షా
కిరణ్ ఇటీవల ‘మాకు మేమే.. మీకు మీరే’ అనే చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమయ్యాడు. ఇప్పుడు
హుస్సైన్ కు చిరు సినిమాలో కామెడీ పోర్షన్ రాసే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి, సునీల్,
అలీ, బ్రహ్మానందం వీళ్ళ మధ్య వచ్చే కామెడీ పోర్షన్ ను హుస్సేన్ తో రాయించారట. ఒరిజినల్ సినిమాకు
రీమేక్ కు చాలా మార్పులు చేసి సోల్ మిస్ అవ్వకుండా కథనంలో మార్పులు చేశారని సమాచారం. చిరు
కామెడీ టైమింగ్ ను దృష్టిలో పెట్టుకొని హుస్సేన్ సంభాషణలు అందించాడని సమాచారం.