HomeTelugu Trendingఅమిగోస్: ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. వీడియో సాంగ్‌ విడుదల

అమిగోస్: ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. వీడియో సాంగ్‌ విడుదల

Amigos
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమిగోస్’. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన పోస్టర్స్ అందరిలో ఆసక్తిని రేకెత్తించాయి.

తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ రాదే వెన్నెలమ్మా’ అనే వీడియో సాంగును విడుదల చేశారు. గతంలో బాలకృష్ణ చేసిన ‘ధర్మక్షేత్రం’ సినిమాలోనిది ఈ పాట. ఇళయరాజా స్వరకల్పనలో బాలు – చిత్ర ఆలపించిన ఆ పాట, రొమాంటిక్ సాంగ్స్ లో ముందువరుసలో కనిపిస్తుంది.

అలాంటి ఆ పాటను ఈ సినిమా కోసం కల్యాణ్ రామ్ రీమిక్స్ చేయించాడు. ఎస్పీ చరణ్ – సమీరా భరద్వాజ్ ఈ పాటను ఆలపించారు. కల్యాణ్ రామ్ – ఆషిక రంగనాథ్ పై చిత్రీకరించిన ఈ పాట ఆకట్టుకుంటుంది. గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఫిబ్రవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu