HomeTelugu Trending'ఎక్స్‌ట్రా- ఆర్డినరీ మేన్‌' ట్రైలర్‌

‘ఎక్స్‌ట్రా- ఆర్డినరీ మేన్‌’ ట్రైలర్‌

Extra Ordinary Man Traileటాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ ట్రా – ఆర్డినరీ మేన్‌’. వక్కంతం వంశీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్టుగా కనిపించనున్నాడు. దర్శకుడిగా వక్కంతం వంశీకి ఇది రెండో సినిమా. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆయన ఈ కంటెంట్ ను రెడీ చేసుకున్నాడు.

డిసెంబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కామెడీ, యాక్షన్ ప్రధానమైన సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

హారిస్ జైరాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో శ్రీలీల అలరించనుంది. కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న నితిన్ కి ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి. ఇక ‘స్కంద’, ‘ఆదికేశవ’ ఆశించిన సక్సెస్ ను అందుకోలేకపోయిన శ్రీలీలకి కూడా హిట్ చాలా అవసరమే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu